సన్న బియ్యం పంపిణీ పథకం కాదు.. పేదలకు వరం: మంత్రి కోమటిరెడ్డి

సన్న బియ్యం పంపిణీ పథకం కాదు.. పేదలకు వరం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ అనేది సంక్షేమ పథకం కాదని.. ఆ స్కీమ్ పేదలకు వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. శనివారం (ఏప్రిల్ 5) నార్కట్‎పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని మెడి సోములు అరుణ ఇంటికి ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి కోమటిరెడ్డి భోజనానికి వెళ్లారు. 

ఈ సందర్భంగా రేషన్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నాన్ని మంత్రి కోమటిరెడ్డి తిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు ఒక దళిత కుటుంబంతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఇదే ప్రతి పేదవాడు కలలు కన్నా తెలంగాణ అని అన్నారు. ఈరోజు అరుణ ఇంట్లో భోజనం చేస్తుంటే నా చిన్నతనంలో గ్రామాలలో కింద కూర్చుని భోజనం చేసిన పరిస్థితులు గుర్తుకు వచ్చాయని పాత జ్ఞాపకాలు యాది చేసుకున్నారు.

Also Read:-తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్‎దే పవర్

ప్రభుత్వం ఏర్పడి 16 నెలలే అవుతున్న ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. యంగ్ ఇండియాలో భాగంగా కుల మతాలకతీతంగా అందరూ ఒకే విధంగా చదువుకోవాలని ఉద్దేశంతో  ఇంటిగ్రేటెడ్ స్కూల్‎లను నిర్మిస్తున్నామని అన్నారు. అలాగే.. ఈ వారంలోనే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు ప్రారంభిస్తామని తెలిపారు.