హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో రోడ్లు అన్ని బాగు చేస్తామని.. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నా నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను 18 నెలల్లో కంప్లీట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. రోడ్లు డ్యామేజ్ అయిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన 10 నెలల నుండి రోడ్ల మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. రోడ్ల మరమ్మతులుకు పార్ట్స్ హోల్ ఫిల్లింగ్.. జెట్ స్పాచ్ మిషన్ అనే కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు.
2015 నుండి జీహెచ్ఎంసీలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తుండగా.. తొలిసారిగా ఆర్ &బి రోడ్ల మరమ్మతులకు కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు. పంచాయతీ రాజ్, ఆర్ &బి శాఖ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో రోడ్లు లేని చోట్ల రోడ్లు వేస్తామని తెలిపారు. వచ్చే 2 నెలలో రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని.. ఈ మేరకు అధికారులను ఫీల్డ్‌కు పోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
ALSO READ | వీకెండ్లో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే పబ్లిక్కు గుడ్ న్యూస్
2021లో రంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి మంజూరు అయితే ఇంత వరకు పనులు స్టార్ట్ కాలేదని.. దానికి ఇటీవల ఎన్జీటీలో క్లియరెన్స్ వచ్చిందని పేర్కొన్నారు. వచ్చే నెల చివరకు హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల రోడ్ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఏడేళ్లు అయిన పూర్తి కాలేదని.. మేం అధికారంలోకి రాగానే ఈ ఫ్లై ఓవర్ పనులు స్టార్ట్ చేయటానికి టార్గెట్ ఇచ్చామని.. 18 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి 7 కిలోమీటర్లు ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడు ఎన్హెచ్ఏఐ అధికారులు, ప్రధాని దగ్గరకు వెళ్లి రోడ్లు మంజూరు చేయాలని అడగలేదని.. ప్రధానిని మోడీ బోడి అని విమర్శించాడన్నారు. రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర డబుల్ రోడ్లు వేస్తామని తెలిపారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చాలా బాధాకరమని.. అధికారులు మీద దాడి కరెక్టు కాదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పాలి కానీ దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.