సీఎంను గౌరవించడం నేర్చుకో.. కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి  ఫైర్​

హైదరాబాద్​: కేసీఆర్ కాలు గోటికి కూడా సీఎంరేవంత్ రెడ్డి సరిపోడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు.  రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా నీవు సరిపోవంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించాడని ఎద్దేవా చేశారు.  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహాదేవపూర్ లో  వేణుగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ   కేటీఆర్  భాష మార్చుకోవాలని,  సీఎంను గౌరవించడం నేర్చుకోవాలని  హితవు పలికారు.  రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా  జడ్పీటీసీ నుంచి సీఎం అయిన వ్యక్తి అని..  నువ్వు కేసీఆర్ పేరుతో దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావని ఘాటుగా విమర్శించారు.   కేటీఆర్ అహంకారంతోనే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు.  కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేసే చూపిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తెలిపారు.