నల్లగొండ:సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లి వేణుగో పాల స్వామి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి సుదర్శన యాగంలో పాల్గొన్నారు. రైతులు, రాష్ట్రప్రజలు సంతోషంగా ఉండాలని వేణుగోపాల స్వామిని కోరుకున్నామని చెప్పారు. గురుపౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా రూ. 2వేల కోట్లు మంజూరు చేశారన్నారు. బ్రాహ్మణ వెళ్లాంల ఉదయ సముద్రం ప్రాజెక్టునుంచి వచ్చే మార్చి వరకు పూర్తి చేసి ఆ ప్రాంతానికి కృష్ణా జలాలు అందిస్తామన్నారు. రైతుల రుణమాఫీ కోసం ఒకే రోజు 6వేల కోట్లు రైతులు ఖాతాలో వేసి వారి కళ్లలో ఆనందం చూశామన్నారు. ఆగస్ట్ వరకు రూ. 2లక్షల రుణమాఫీ అందరి రైతులకు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.
జిల్లాలో శైవ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలో రూ2వేల కోట్లతో 200 కాటేజీలు నిర్మిస్తామన్నారు. జాతీయ రహదారి65 విస్తరణ కోసం కేంద్ర మంత్రి నితిన్ గట్కారి ని కలిసి విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ గా విస్తరణకు పనులకు ఆమోదం పై చర్చిస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.