కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..

 

  • సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్త

  •  కారు షెడ్డు మూసుకుంటవా

  • బండి, అర్వింద్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత పిచ్చిలేసి పోతరు

  •  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్  విసిరారు. తాను నల్లగొండ ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేస్తానని, కేటీఆర్ఎస్ కూడా రిజైన్ చేయాలన్నారు. సిరిసిల్లలో తాను పోటీ చేసి గెలుస్తానని, అలా అయితే కారు షెడ్డు మూసుకుంటారా..? అని ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ఓడితే పార్టీ క్లోజ్ చేస్తానని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను సిరిసిల్లలో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేటీఆర్ కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని చెప్పారు. కేటీఆర్ ఓ చిన్న పిలగాడని, తన స్థాయి కేటీఆర్ ది కాదని అన్నారు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదని, లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.

 కేటీఆర్ 200 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, తానైతే రాజీనామా చేసేవాడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బండి సంజయ్, అర్వింద్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారని, ఎంపీ ఎన్నికల తర్వాత పిచ్చి లేసి పోతారని అన్నారు. వీళ్లిద్దరూ పొలిటికల్ లీడర్లు కాదని గాల్లో గెలిచారన్నారు. బ్రేకింగ్ కోసం మాత్రమే మాట్లాడు తారని విమర్శించారు. ఆ నలుగురు ఎంపీలు రాష్ట్రం కోసం ఎప్పుడూ పార్లమెంట్ లో మాట్లాడలేదని అన్నారు.