గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు : మంత్రి కొండా సురేఖ

గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు : మంత్రి కొండా సురేఖ
  • వరంగల్ నగరం డెవలప్ మెంట్ కు రూ. 187 కోట్లు విడుదల 
  • 22వ డివిజన్ లో రూ. 2కోట్లకు పైగా రోడ్ల పనులకు శంకుస్థాపనలు

వరంగల్​సిటీ, వెలుగు:  గత బీఆర్ఎస్ సర్కార్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపడంతోనే   పదేళ్లుగా అభివృద్ధి పనులు  నిలిచిపోయాయని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శించారు.  కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక  కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.  గురువారం నియోజకవర్గ పరిధి లోని 22వ డివిజన్ మర్రి వెంకటయ్య కాలనీలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు రూ.2 కోట్ల 60 లక్షలు, 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు మంత్రి సురేఖ ప్రారంభించారు.

   35వ డివిజన్ లోని ఏసీ నగర్ లో ప్యాకేజీ -7లో భాగంగా స్మార్ట్ సిటీ నిధులు రూ.2 కోట్ల 90 లక్షల  వ్యయంతో,  ప్యాకేజీ -7 లో భాగంగా  సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.30 లక్షల బల్దియా సాధారణ నిధులతో అంతర్గత రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  కార్పొరేషన్ లో నిధుల కొరత వల్ల  బిల్లుల చెల్లింపులు జరగక కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేయడం లేదని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి ప్రత్యేకంగా రూ.187 కోట్లు విడుదల చేసిందన్నారు.  కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి,  కమిషనర్ డాక్టర్ అశ్విని వాకడే , అదనపు కలెక్టర్ సంధ్య రాణి, కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి,  సోమిశెట్టి ప్రవీణ్, ఈఈ శ్రీనివాస్, డీఈ రాజ్ కుమార్, ఏఈ హరికుమార్ స్థానిక నాయకులు  తదితరులు 
పాల్గొన్నారు.