హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నాం: కొండా సురేఖ

వరంగల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. వేల కోట్ల రూపాయలను గ్యారెంటీల కోసం ఖర్చు చేశామని, మేము చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.వరంగల్ అభివృద్ధిపై గత ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పేవని, తాము ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేశామని అన్నారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు మంత్రి కొండా సురేఖ. 

ALSO READ | Health Alert : కాలుష్యం.. మీ కళ్లను కాటేస్తోంది.. నిర్లక్ష్యం వద్దు.. అలర్జీ దశలోనే జాగ్రత్తలు తీసుకోండి..!

మైకుల ముందు ఊదరగొట్టిన గత పాలనకు, సిఎం రేవంత్ పాలనకు తేడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.చరిత్రలో నిలిచిపోయేలా ఇందిరా మహిళా శక్తి సభ నిర్వహిస్తామని అన్నారు. మంత్రి సురేఖతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాంజేందర్ రెడ్డి మాట్లాడుతూ...ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని.. ఇచ్చిన హామీలను నెరవేర్చి వరంగల్ లో సభ నిర్వహిస్తున్నామని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి గారికి వరంగల్ జిల్లా రుణపడి ఉంటుందని, వరంగల్ కు అడిగినన్ని నిధులు సిఎం కేటాయించారని అన్నారు.