మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు

  • ముస్లిం రిజర్వేషన్ల రద్దును కాంగ్రెస్‍ ఖండిస్తోంది 
  • 92 శాతం రైతుబంధు ఇచ్చినం.. 2 లక్షల రుణమాఫీ చేస్తం
  • రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: రాముడిని..ఆయన భార్య సీతతో ప్రతిష్ఠించాలని..కానీ, ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మచారి కాబట్టే బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం ఆమె వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో ప్రెస్‍మీట్ నిర్వహించి 
మాట్లాడారు. రామమందిరం, రాముడి పేరుచెప్పి ఎన్నికల ప్రచారం చేయడం తప్పించి బీజేపీ వాళ్లు రాముడిని పూజించడం లేదన్నారు. అమిత్‍షా తన ఎన్నికల ప్రచారంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దీన్ని కాంగ్రెస్‍ పార్టీ ఖండిస్తోందన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 92 శాతం రైతుబంధు ఇచ్చామని.. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులో నీరు వదలడానికి వీలు లేకుండా ప్రమాదకరంగా తయారైందన్నారు. ప్రస్తుత పార్లమెంట్‍ ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍ తరఫున పోటీలో ఉన్నోళ్లంతా ఛరిష్మా లేనోళ్లే అని అన్నారు.