వరంగల్లో హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆస్పత్రిపై MGM అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్నారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. వరంగల్ MGM హాస్పిటల్ రాష్ట్రానికే గుండెకాయ లాంటిదన్న మంత్రి... దీని ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు. MGM ను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు మంత్రి. గతంలో జరిగిన ఘటనలు రిపిటీ కావొద్దని అధికారులకు సూచించారు.
ఇటీవల కోతుల బెడదతో వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగితే.. అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను పునరుద్దరించారని చెప్పారు. హాస్పిటల్ లో ప్రస్తుతం 25 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారని వివరించారు. వరంగల్ MGM అధికారులు, హాస్పిటల్ సిబ్బందితో రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ.