
హైదరాబాద్, వెలుగు : గచ్చిబౌలిలోని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) ఆఫీసులో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శిక్షణా సంస్థ సమస్యల నిలయంగా మారిందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈపీటీఆర్ఐ సంస్థని గాడిలో పెట్టాలని..సమస్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని సంస్థ డైరెక్టర్ జనరల్ అహ్మద్నదీంను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకొని తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.