నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తున్నం : మంత్రి కొండా సురేఖ

నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తున్నం : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు : దేశ తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గట్టి సంకల్పంతో పనిచేస్తున్నదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను మంత్రి స్మరించుకున్నారు. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మిన వ్యక్తి నెహ్రూ అని అన్నారు.

పిల్లలకు సరైన విద్య, శిక్షణ, సంరక్షణ ఉంటే వారు దేశానికి మూలస్తంభాలుగా నిలుస్తారని భావించి ఆ దిశగా కార్యాచరణను అమలు చేసిన దార్శనికుడు అని కొనియాడారు. పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నెహ్రూ మదిలో మెదిలిన ఆలోచనలే దేశగతిని మార్చే విద్యా సంస్థలుగా సేవలందిస్తున్నాయన్నారు.