కాశీబుగ్గలో మంజూరైన పనులు వేగంగా చేపట్టాలి : కొండా సురేఖ

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: అనుమతులు మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గ్రేటర్​ వరంగల్ పరిధిలోని 42వ డివిజన్​తెలంగాణ కాలనీలో మంగళవారం ఆమె పర్యటించారు. కాలనీ మ్యాప్​ను పరిశీలించి, ఆఫీసర్లలు కాలనీ వాసులతో మాట్లాడారు. డ్రైనేజీ మంజూరైపా పనులను ప్రారంభించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 

వెంటనే శంకుస్థాపన చేసి, ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్​ బాషా, కార్పొరేటర్ చందన, సిటీ ప్లానర్​ వెంకన్న, టౌన్​ప్లానింగ్, విద్యుత్​అధికారులు ఉన్నారు. అంతకు ముందు వరంగల్​ తూర్పు నియోజకవర్గంలోని అబ్నూస్ ఫంక్షన్ హాల్​లో 278 మంది లబ్ధిదారులకు మంత్రి సురేఖ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పెండింగ్​పెట్టిన లబ్ధిదారుల లిస్టును తనకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల హామీ ప్రకారం త్వరలోనే కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా116తోపాటు తులం బంగారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.