- అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
కాశీబుగ్గ, వెలుగు : నిరుపేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ర్ట ప్రభుత్వ పని చేస్తుందని రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎల్బీనగర్ ప్రాంతం క్రిస్టల్ గార్డెన్లో తూర్పు నియోజకవర్గంలోని 454 మంది లబ్ధిదారులకు మంత్రి రూ.3,97,96,308 విలువ చేసే సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందుకోసం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారన్నారు.
ఫార్మా సిటీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని వివరించారు. ఆయా పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా వరంగల్ నగరంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని
డబుల్బెడ్రూం ఇండ్లను కూడా అర్హులకు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, కార్పొరేటర్లులు మహమ్మద్ ఫుర్ఖాన్, గుండు చందన పూర్ణచందర్, చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, బైరబోయిన ఉమా దామోదర్, సురేశ్ జోషి, ముష్కమల్ల అరుణ సుధాకర్, భోగి సువర్ణ, సోమిశెట్టి ప్రవీణ్, బాల్నే సురేశ్ తదితరులు పాల్గొన్నారు.