గ్రేటర్ వరంగల్, వెలుగు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను బుధవారం మంత్రి కొండా సురేఖ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 446 మందికి చెక్కులు అందజేసినట్లు చెప్పారు.
తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.