గ్రేటర్వరంగల్, వెలుగు: కేసీఆర్ బిడ్డ కవితను జైలు నుంచి బయటకు తీసుకురావాలనే బీజేపీకి పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోందని రాష్ర్ట దేవాదాయ, పర్యావరణ, ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం వరంగల్‌తూర్పు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయన్నారు.
ఇందులో భాగంగానే బీఆర్ఎస్లీడర్లను బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నారన్నారు. స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్‌కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తన బిడ్డ కావ్య గెలుపు ఖాయమైపోయినట్టు కనిపిస్తోందన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ లీడర్మహ్మద్ ఆయూబ్ పాల్గొన్నారు.