హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలందరికి అన్ని విధాలా లబ్ధి చేకూరుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ సర్వేతో రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల అంచనా వేయడం జరుగుతుంది.. బీసీ కుల గణనతో కులాల వారీగా రాజకీయ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. సమగ్ర సర్వే సేకరించిన సమాచారం గుప్తంగా ఉంచబడుతుందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎష్టీల, మైనార్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరగడం కోసమే ఈ సమగ్ర సర్వే అన్నారు మంత్రి కొండా సురేఖ. 1831లో బ్రిటీష్ కాలంలో జరిగిన కుల గణన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహిస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఛాలెంజ్ గా తీసుకుని కులగణన చేపట్టాలని సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలన్నారు.. రాష్ట్రంలో పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు.