మేడ్చల్ జిల్లా : కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శివాలయాల్లో ప్రతి సోమవారం సామూహిక దీపోత్సవం కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో కీసరగుట్ట శివాలయంలో మంత్రి కొండా సురేఖ దీపారాధన చేసి.. పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆలయ చైర్మన్ తటాకం నాగా లింగం శర్మ, ఆలయ పండితులు స్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ మనవడితోపాటు గర్భాలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. శివ లింగానికి అభిషేకం చేయించారు. అనంతరం మహా మండపంలో స్వామి వారు తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. 200 మంది మహిళలతో కలిసి సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు కుంకుమ, పసుపు, బొట్టు, జాకెట్, గాజులు అందజేశారు మంత్రి కొండా సురేఖ. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ సామూహిక దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపం వెలిగించాలని సూచించారు. కీసర గుట్ట ఆలయాన్ని త్వరలో అభివృది చేస్తామని ఆమె హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.