సికింద్రాబాద్ పరిధిలో శ్రీ ఉజ్జయిని మహంకాళీ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు హాజరు కావాలంటూ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు గురువారం మంత్రి సురేఖకు హన్మకొండ రాంనగర్ లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. అర్చకులు మంత్రికి వేదాశీర్వాచనాలు అందించి, అమ్మవారి శేష వస్త్రాలు ప్రదానం చేశారు.
ఈ నెల 21,22 తేదీల్లో మహంకాళి బోనాల ఉత్సవాలు జరగనున్నాయని, ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ మంత్రి కొండా సురేఖను ను కోరింది. తెలంగాణ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగే బోనాల ఉత్సవాల్లో మహంకాళీ అమ్మవారి బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.