![రైతులకు తీపి కబురు: త్వరలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం](https://static.v6velugu.com/uploads/2024/09/minister-konda-surekha-is-good-news-for-farmers_I15Z9OPdou.jpg)
మెదక్: రైతులకు మంత్రి కొండా సురేఖ తీపి కబురు చెప్పారు. త్వరలోనే రైతు భరోసా, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఇవాళ (సెప్టెంబర్ 25) అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. జీలుగ విత్తనాలు రైతులందరికి అందేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఎరువుల కొరత ఉందని హరీష్ రావు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వెంటనే చర్యలు తీసుకుని ఎరువుల కొరత లేకుండా స్టాక్ పెట్టాలని అధికారాలను ఆదేశించారు.
ALSO READ | రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం: మంత్రి కొండా సురేఖ
ఫసల్ బీమా విషయంలో కేంద్రం నుండి నిధులు వచ్చేలా స్థానిక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చొరవ చూపాలని కోరారు. హామీ ఇచ్చినట్లుగా సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున ఈ సీజన్ నుండే ఇస్తామని తెలిపారు. చేప పిల్లలు ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించి.. వారి చేత చేప ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయించాలన్నారు. గృహ లక్ష్మీ పథకంలో ఆలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్లు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తెలుసుకుందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.