ఖిలావరంగల్ (కరీమాబాద్), వెలుగు: దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం బల్దియా నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగలీల మైదానం (ఉర్సు గుట్ట) కరీమాబాద్ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినం సందర్భంగా ఉత్సవాలకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ సలీమా, విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు, కార్పొరేటర్లు, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చర్చి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
కాశీబుగ్గ: గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ కాలనీ సీబీసీ చర్చి ప్రారంభోత్సవ వేడుకల్లో మంగళవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కార్పొరేటర్ వస్కుల బాబు, మైనార్టీ నాయకులు ఆయూబ్, పాస్టర్లు నిరంజన్ బాబు, జాన్ వెస్లీ, జాన్ ప్రభాహారన్, మృత్యుంజయ, జెర్మియా, జగ్జీవన్ బాబ్జీ తదితరులున్నారు.