టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి

టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి
  • ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె
  • అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ 

ఖమ్మం :   టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా లక్ష్యం పెట్టుకున్నామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ  అన్నారు. ఇవాళ  సత్తుపల్లిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సురేఖ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ 1950 లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వన మహోత్సవం ప్రారంభించరన్నారు. ఇటీవల వరంగల్ లో సీఎం రేవంత్ వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించారిన పేర్కొన్నారు.  పూర్వకాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవని, కానీ ఇప్పుడు  చల్లని నీడను ఇచ్చే చెట్లు  ఎక్కడా కనిపించటం లేదన్నారు.  రోడ్ల విస్తరణ, ఇళ్ల నిర్మాణం పేరుతో వృక్షాలను నరికివేస్తున్నాన్నారు.  ముందు తరాలకు మంచి చేయాలంటే ఇప్పటి నుండే చెట్లను పెంచాలన్నారు.  ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చెట్లను నాటాలని అధికారులకు సూచించారు. * అడవుల్లో ఫలాలు ఇచ్చే చెట్లను పెంచి కోతులు బయటకు రాకుండా అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు.  

చెట్లను పెంచేందుకు కష్టపడాలె

 చెట్లను పెంచేందుకు చాలా కష్టపడాలని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  పచ్చదనంలోని గొప్పతనం మరెక్కడా లభించదన్నారు.  పెద్దోళ్లు వందేళ్లు బతికారు అంటే చెట్లే కారణమన్నారు.  ఒక్కో వ్యక్తి 5 నుంచి 10 మొక్కలు పెంచేలా సంకల్పం తీసుకోవాలన్నారు.  విద్య,వైద్యం అన్ని రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమతుల్యంగా పని చేస్తుందని ఆయన చెప్పారు.

ఉద్యమంలా మొక్కలు నాటాలె

హైదరాబాద్ : ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  పిలుపునిచ్చారు. ఇవాళ  బుధవారం పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని  అన్నారు. మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.