మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: జయశంకర్ భూపాలపల్లి టేకుమట్ల మండలం రాఘవాపూర్ కి చెందిన దండ్రే రమేశ్ కవిత దంపతుల చిన్న కూతురు మహాలక్ష్మి డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంది.
విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆదివారం రాత్రి హాస్పిటల్ కు వెళ్లి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ట్రీట్మెంట్కోసం తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.