భక్తులకు అన్ని వసతులు కల్పించండి.. జోగలాంబ ఆలయ ఈవోకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

భక్తులకు అన్ని వసతులు కల్పించండి.. జోగలాంబ ఆలయ ఈవోకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీజోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు  నిర్వహించబోయే శ్రీజోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ మంత్రి కొండా సురేఖ ఆలయ ఈవో పురేందర్ కుమార్ ను ఆదేశించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 

ప్రసాద్ స్కీం నిధులతో నిర్మించిన నూతన భవనంలో భక్తులకు అన్నదానం, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలకు రావాలంటూ మంత్రి కొండా సురేఖకు  ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ఆహ్వానపత్రిక అందించారు. 

ALSO READ | ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం

ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. మంత్రి కలిసి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున మంత్రి సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.