సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిథులు, అధికారులతో పాటు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లడుతూ రైతు భరోసా త్వరలో అమలు చేస్తామని తెలిపారు. జీలుగు విత్తనాలు ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలంటూ.... బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఎరువుల కొరత ఉందంటున్నారు. ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. సకాలంలో ఎరువులు అందించేందుకు కావలసినంత స్టాక్ ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ALSO READ | గుడ్ న్యూస్: తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టం ఇస్తామంటూ... అలాగే సన్న వడ్లకు ప్రకటించిన రూ. 500 బోనస్ కూదా ఇస్తామన్నారు. ఇక గృహలక్ష్మీ పథకంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కలెక్టర్ కు ఆదేశాలు జారీచేశారు. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఫసల్ బీమా విషయంలో ఎంపీ చొరవ తీసుకోవాలన్నారు.
ALSO READ | ఈసారి వడ్లసాగులో రికార్డు..సగానికి పైగా సన్నాలే
హరీష్ రావు మాట్లాడుతూ తాము అధికారులకు వినతిపత్రం ఇస్తే తీసుకోవడం లేదన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా అధికారులకు వినతి పత్రం ఇస్తే తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన వారికి చేపలు పట్టే అవకాశం ఇచ్చామని ,ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలన్నారు. అక్టోబర్ నుంచి వడ్ల కొనుగోలు చేసే సమయం వస్తుందని.. కాని కొంత మంది రైస్ మిల్లర్లు సన్న వడ్ల మాకు వద్దు అనిఅంటున్నారంటూ.. రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు.