వన్యప్రాణుల వేట కట్టడికి క్యాచ్ ది ట్రాప్ : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ 

వన్యప్రాణుల వేట కట్టడికి క్యాచ్ ది ట్రాప్ : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, వెలుగు: వన్యప్రాణుల వేట, అటవీ జంతువుల అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి “క్యాచ్ ది ట్రాప్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. మంగళవారం వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న అటవీశాఖ సిబ్బంది, ప్రకృతి ప్రేమికులను మంత్రి ఓ ప్రకటనలో అభినందించారు.

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాగా, బుధవారం సీఎం రేవంత్​తో కలిసి ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్ కు మంత్రి సురేఖ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కొత్తగూడెం పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా ప్రారంభిస్తారు.