గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్లలో రూ 1.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపలు చేశారు. వరంగల్‌లో మామునూరు ఎయిర్ పోర్ట్ సర్వే కూడా జరుగుతోందని, సర్వే అయితే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ ఎస్ నేతలు విమర్శలు మాని సలహాలు సూచనలు ఇవ్వాలని, అనవసరంగా విమర్శలు చేస్తే సహించేదీ లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం శాఖరాశి కుంట నుంచి కీర్తి బార్ వరకు గల నాలను పరిశీలించి నాలా స్థలం ఆక్రమణకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని బల్దియా అధికారులను నాలను శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి, కార్పొరేటర్లు కావేటి కవిత, ముహమ్మద్ ఫుర్ఖాన్, పోశాల పద్మ, పల్లం పద్మ పాల్గొన్నారు.