కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చు:మంత్రి కొండా సురేఖ

కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చు:మంత్రి కొండా సురేఖ
  • విభజించి పాలించే మనస్తత్వం ఆపార్టీది
  • 1హుల్​ఇంటికెళ్లి అడిగితే ఆయన కులం ఏంటో చెప్తడు
  • అన్నిటికీ కులగణననే బేస్ -మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే  పార్టీ బీజేపీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాహుల్ గాంధీ కులం గురించి అడిగేవాళ్లు.. ఆయన​ఇంటికి ఫామ్ తీసుకెళ్లి అడిగితే కులం ఏంటో రాహులే  చెబుతారని తెలిపారు. గాంధీ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ అని విమర్శించారు.

 ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం ఆపార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. ‘రాష్ట్రంలో  ప్రజాస్వామిక పాలన నడుస్తోంది. గత పదేండ్లలో కేసీఆర్ ఎవ్వరికీ  అపాయింట్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి.. ప్రజావాణిని నడిపిస్తున్నం. బీఆర్ఎస్ వాళ్లు చేసిన స్కామ్ లు వారికి కలలో కనిపిస్తున్నట్లు ఉన్నాయి. 

ALSO READ : సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని విధాలా లబ్ది: మంత్రి కొండా సురేఖ

బడుగు, బలహీన వర్గాల వారు విద్య ,ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి పోతున్నారు. దీనికి కారణం కులవివక్ష అని రాహుల్ గాంధీ చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు అన్ని విధాలా లబ్ధి చేకూరుతుంది. దేశ, విదేశాల్లో ఉన్న వాళ్ల వివరాలు కూడా డేటాలో ఉంటది. అన్నిటికీ కులగణన బేస్ కాబోతోంది. దీనిని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నారు’ అని తెలిపారు.