ఆధునిక ప్రపంచంలో కూడా మహిళలకు అన్యాయం:మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ : ప్రపంచం ఎంతో అడ్వాన్స్ గా ముందుకు సాగుతోంది..టెక్నాలజీ లో దూసుకెళుతున్నాం..అయినా మహిళలపై అఘాయిత్యాలు, అన్యాయం జరుగుతూనే ఉన్నాయన్నారు మంత్రి కొండా సురేఖ.ఎలక్ట్రిక్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ డే ఉత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. భూమికి ఉన్నంత ఓపిక మహిళలకు ఉంటుంది.. తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని పాత్రలు ఎంతో సహనంతో పోషిస్తుంది..అలాంటి మహిళలపై అడ్వాన్స్ డ్ టెక్నాలజీ యుగంలో కూడా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో ఎంతో అన్యాయం జరుగుతోందని మంత్రి చెప్పారు. 

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్సుకు కృషి చేస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అమ్మాయి పుడితే అయ్యో అమ్మాయి పుట్టిందా..అని పెదవి విరిచే రోజులు ఇంకా కొనసాగుతున్నాయి.. ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి అని చెప్పారు మంత్రి కొండా సురేఖ.  

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి యేటా మార్చి 8 న జరుపుకుంటారు. ఈ సందర్భంగా మార్చి మొదటి వారం మొత్తం మహిళలు సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక , రాజకీయ రంగాలలో మహిళలు విజయాలు, సహకారాలను స్మరించుకుంటారు. ఈ సంస్కృతి ఇప్పటిది కాదు.. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వమిస్తున్నారు. లింగ సమానత్వం, సామాజిక మార్పును ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే ఈ సెలబ్రేషన్స్ ప్రోత్సహిస్తాయి.