కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం గెలిచి సీఎంకు గిఫ్ట్ ఇద్దాం : కొండా సురేఖ

కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం గెలిచి సీఎంకు గిఫ్ట్ ఇద్దాం : కొండా సురేఖ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు మెదక్ ఇన్ ఛార్జ్ మంత్రి కొండా సురేఖ.  ఇది మన సిట్టింగ్ సీటు ఖచ్చితంగా గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. గ్రాడ్యుయేట్స్ అంతా నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.  మెదక్ లోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నారు. 

Also Read :- 8 మందిని కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దింపుతున్నాం

రఘునందన్ రావు దుబ్బాకకు ఎమ్మెల్యే గా.. మెదక్ ఎంపీగా ఉండి  ఒక్క రూపాయి అయినా తీసుకురాలేదన్నారు. ఇద్దరు  కేంద్రమంత్రులు గాడిద గుడ్డు తెచ్చారని ఫైర్ అయ్యారు.  బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి.. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు సురేఖ.

 కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది: మంత్రి దామోదర

14నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్కో హామీ అమలు చేస్తున్నాం .  కాంగ్రెస్  అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యావేత్త . నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైన ఉంది.  జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి 56 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం.  కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది.  దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చట్టాలు తెచ్చింది. 30ఏండ్లుగా విద్యా రంగంలో నరేందర్ రెడ్డి సేవ చేస్తున్నారు. 1931లో కుల గణన చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేసింది. ఆరు నెలల్లో ఎస్సి వర్గీకరణ పై క్యాబినెట్ అమోదించి అసెంబ్లీ తీర్మానం చేశాం.  మెదక్ ను చార్మినార్ జోన్ లో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల నిర్ణయం ఉంటుంది.  స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావాలి అని దామోదర రాజనర్సింహ అన్నారు.