హీరో హీరోయిన్ అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవటానికి కారణం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య, సమంతనే కాకుండా.. కొంత మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కారణం కేటీఆర్ అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ. 2024, అక్టోబర్ 2వ తేదీ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారామె.
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నిస్తూనే.. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి.. ముఖ్యంగా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ విమర్శించారు మంత్రి సురేఖ. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని.. అధికార మదంతో.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడటం ఎందుకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | తిరుమలలో పవన్.. చేతిలో ‘వారాహి డిక్లరేషన్’.. ఇంతకీ అందులో ఏముంది..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది హీరోయిన్స్ వెళ్లిపోవటానికి కూడా కేటీఆర్ కారణం అని.. అసలు నీకు విలువలు ఉన్నాయా అంటూ దుమ్మెత్తిపోశారు మంత్రి సురేఖ. దుబాయ్ నుంచి సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడని.. అసలు నువ్వు మనిషివేనా అంటూ నిలదీశారు మంత్రి సురేఖ. నీకు కుటుంబం లేదా.. మానవత్వం లేదా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు మంత్రి సురేఖ..