ఏనుమాముల మార్కెట్​లో పత్తి కొనుగోళ్లు షురూ

ఏనుమాముల మార్కెట్​లో పత్తి కొనుగోళ్లు షురూ
  • ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ 

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి  కొనుగోలు సెంటర్​ను సోమవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, సీసీఐ జనరల్ మేనేజర్ అర్జున్, జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ రావు, మార్కెట్ సెక్రెటరీ నిర్మల, ఛాంబర్​ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికే రాష్ర్ట ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాల్ పత్తి ధర రూ.7,525 గరిష్టంగా ఉండగా, కనిష్టంగా రూ.7,100 అందజేస్తుందని, పత్తికి సంబంధించిన డబ్బులు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఫోన్​లో యాప్​ను తీసుకువచ్చినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, జేడీఎం శ్రీనివాస్ రావును ఘనంగా సన్మానించారు.

అనంతరం కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ర్ట ప్రభుత్వం అందజేస్తున్న రక్షణ కిట్లను కల్లుగీత కార్మికుల సహాకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో 10 వేల మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను మంత్రి సురేఖ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సులోచన, డీడీఎం వి.పద్మావతి, డీఎండీ సురేఖ, ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాశ్, ఉపాధ్యక్షుడు మొగిలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా శాకరాసికుంటలో నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.