తొగుట మండలంలో .. అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

తొగుట మండలంలో .. అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో  బుధవారం రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా తుక్కాపుర్ గ్రామం వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నుంచి దుబ్బాక కు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా బాలికల హాస్టల్, జీపీ భవనం, ప్రభుత్వ పాఠశాలలో  నిర్మించిన  డైనింగ్ హాల్, టాయిలెట్స్, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.

అనంతరం చలి కాలంలో విద్యార్థులకు సోలార్ ద్వారా వేడి నీరు అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జీవన్ పాటిల్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ లత, సర్పంచ్ కొండల్ రెడ్డి, నాయకులు స్వామి, భూపాల్, నిరంజన్, తిరుపతి, బాల్ రాజు, మల్లారెడ్డి, శ్రీకర్, ప్రవీణ్ రెడ్డి, షఫీ పాల్గొన్నారు