గురుకులాల్లో కుట్రల వెనక RS ప్రవీణ్ కుమార్: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (నవంబర్ 29) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాల్లో జరుగుతోన్న ఫుడ్ పాయిజన్ కుట్రల వెనక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని.. ఆ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆయన గురుకులాల్లో సిబ్బందని నియమించారని చెప్పారు. 

ALSO READ | స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. రుణమాఫీ చేస్తం.. రైతు భరోసా ఇస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తన అనుచరులనే ఆర్ఎస్పీ గురుకుల సిబ్బందిగా నియమించుకున్నారని.. ఇప్పటికి ఆయన అనుచరులు గురుకులాల్లో సిబ్బందిగా ఉన్నారన్నారు. ఆ అనుచరుల ద్వారానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలల్లో కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కలుషిత ఆహారం తిని వాంకిడి గురుకుల పాఠశాలలలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది.