మంత్రి కొప్పుల అనుచరుల మట్టి మాఫియా...చెరువులను తవ్వేస్తున్నరు

జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుల మట్టి మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. చిల్వాకోడూరు చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టీలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు చెరువులో మట్టిని యథేచ్ఛగా ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ లీడర్లే ఈ దందా చేస్తున్నారు. రోజుకు వంద ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో అధికార పార్టీ లీడర్లు లక్షల రూపాయలు దండుకుంటున్నారని  ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ, మిషన్ భగీరథ, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడు రోజులుగా ధర్మారం మండలం రచ్చపల్లిలో అక్రమ మట్టిని తరలిస్తున్న మాఫియాను  గ్రామస్తులు అడ్డుకున్నారని..వారిపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారని చెప్పారు.  మట్టి దందాలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.