కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ లో త్వరలోనే రూ,3 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని మంత్రి కృష్ణారావు వెల్లడించారు. పట్టణంలోని రాణీ ఇందిరాదేవి ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కాలేజీ వారోత్సవాల సందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో డివిజన్ స్థాయి ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులకు క్రీడా పోటీలను ఆయన మంగళవారం ప్రారంభించారు. సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.
ఈనెల 27, 28, 29 తేదీలలో కొల్లాపూర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొల్లాపూర్ లో జరగనున్నదని, ఈ సమ్మేళనానికి ఇక్కడ చదివి విద్యా , ఉద్యోగ,వ్యాపార రంగాలలో ఎదిగి దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరు హాజరు కాబోతున్నారని మంత్రి వెల్లడించారు. అంతకు ముందు మంత్రి శాంతి పతకాన్ని ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించారు.
వజ్రోత్సవాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాయిప్రసాద్ (సైంటిస్ట్) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రిటైర్డ్ డీఆర్ఓ కటికనేని మదన్మోహన్ రావు, కవి రాందాస్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ దివాకర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య నాగరాజు, ఎంఈఓ ఇమ్మానియేల్, పీజీ డిగ్రీ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాల్లు మార్క్ పోలేనియస్, ఉదయ్ కుమార్, రవి పాల్గొన్నారు.
రైతులను వేధిస్తే చర్యలు తప్పవు...
పానుగల్, వెలుగు: మండల పరిధిలోని సెర్ఫ్ మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం బుసిరెడ్డిపల్లి, చింతకుంట, కొత్తపేట, అన్నారం, గోపులాపూర్, పానగల్, ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు. తరుగు పేరుతో రైతులను వేధిస్తే అధికారులతో పాటు మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సెంటర్లో ప్రతి దానికి రిసిప్ట్ ఉండాలని ఆదేశించారు.