
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. కాలేజీలో జరిగిన గొడవల్ల చనిపోయిన ప్రీతి ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు . ప్రీతి చనిపోతే అందరం బాధపడ్డామన్నారు. ప్రీతికి అన్యాయం చేసిన వారెవరైనా..అది సైఫ్ కానీ ఇంకెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిందితులకు తప్పకుండా చట్టపరంగా ,న్యాయపరంగా శిక్ష వేస్తామని తెలియజేశారు. ఆ ప్రీతి కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని చెప్పారు.