రాజీనామాకు సిద్ధమైన కేటీఆర్!

కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి.. ఇతర రాష్ట్రాల అభివృద్దికి వాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అని అన్నారు. లేకపోతే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల మాట పక్కన పెడితే.. ఉన్న వాటిని ఊడగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మంచి ఎవరు చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత మంచి చేయడానికే పార్టీ పేరు మార్చామే తప్ప అభివృద్ధి, సంక్షేమం విషయంలో తేడా ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.