వరంగల్ : కేసీఆర్ అంటే సంక్షేమం, విపక్షాలది సంక్షోభం అని కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వాళ్లు ఇప్పుడు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఒక్కఛాన్స్ ఇవ్వండని మీ దగ్గరకు వస్తారు.. వారిని నమ్మి మోసపోకండి అని పిలుపునిచ్చారు. పొలిటికల్ టూరిస్టులు చెప్పే మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరే అని అన్నారు. త్వరలోనే కేసీఆర్ నోట శుభవార్త వింటారని చెప్పారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదన్నారు. తమది తెలంగాణలో ఏ టీమ్ అన్నారు.
వరంగల్ తూర్పునియోజకవర్గం పరిధిలోని దూపకుంటలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాన్ని మంత్రి కేటీఆర్ వాయిదా వేశారు. మరోవైపు.. వరంగల్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్రి కేటీఆర్ పర్యటన సాగింది. వరంగల్ నగరంలో రూ.900 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో మాట్లాడారు.