దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన  ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  మంత్రి కెటీఆర్.  పక్క రాష్ట్రం పరిస్థితులపై తన మిత్రుడు చెప్పిన విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఏపీలో క‌రెంట్ లేదని.. నీళ్ళు లేవని.. రోడ్లు ధ్వంసం అయ్యాయన్నారు.అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తన  మిత్రుడు ఊరినుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక  ఊపిరి పీల్చుకున్న‌ట్లు ఉందని చెప్పాడన్నారు. ఒకసారి ఏపీకి వెళ్లి చూస్తే ..  అపుడు తమ విలువేంటో తెలుస్తుందన్నారు. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నారన్నారు.

రూపాయి లంచం లేకుండా అనుమతులు ఇస్తుంది తెలంగాణే ఒక్కటేనన్నారు.  పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీకి... ప్రతిపక్ష పార్టీకి లంచాలు ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారన్నారు. తెలంగాణ ప్రశాంతమైన రాష్ట్రమన్నారు. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్నారు. దేశంలో హైదరాబాద్ లాంటి నగరాలు తక్కువన్నారు.ఐదారు నగరాలే దేశాన్ని నడుపుతున్నాయన్నారు.