హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు పెడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్ అభివృద్దికి రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. సాగునీటి రంగంలో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలో కొత్త, పాత లిఫ్టుల పనుల కోసం రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో పూర్తిస్తాయిలో ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే... గిరిజన సంక్షేమం కోసం రూ. 3.5 కోట్లతో నిర్మించిన బంజారా భవన్‌ను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
హుజూర్ నగర్‌కు రెవెన్యూ కార్యాలయాన్ని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. గిరిజన తండాల్లో రూ.35వేల కోట్లతో రోడ్లను నిర్మించామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.