మీ కాళ్లు మొక్కుతాం సారూ.. జీవో నెం. 46ను రద్దు చేయండి: నిరుద్యోగులు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేథ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నిరుద్యోగులు తిరగబడుతున్నారు. తాజాగా ఖమ్మం పర్యటనలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. 

Also Read : 13 రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఏపీ సర్కార్

తెలంగాణ వస్తే ఇంటికోక్క ఉద్యోగం ఇస్తామని.. ఇన్ని సంవత్సరాలైన ఎవ్వరికీ ఉద్యోగం రాలేదని వాపోయారు. కనీసం ఇకనుంచి అయిన తమ బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు నిరుద్యోగులు. మంత్రి కాన్వాయి ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.