
కర్ణాటక వస్తే తమ పథకాల అమలును చూపిస్తామన్న... ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే... అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ కర్ణాటక రైతులే.. ఇక్కడికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారన్నారు.
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారన్నారు. కర్ణాటక ప్రజల కష్టాలను పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అంటూ డీకేపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ను కర్ణాటక ప్రజలు క్షమించరని, తెలంగాణ ప్రజలు విశ్వసించరని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారని.. తీరా గద్దెనెక్కిన తర్వాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలో ఆడుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. కర్ణాటకలో గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందన్నారు. ఎడాపెడా కరెంట్ కోతలు,చార్జీలతో కర్ణాటక చీకటి రాజ్యంగా మారిపోయిందన్నారు.
డీకే గారు...
— KTR (@KTRBRS) October 29, 2023
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…