- సభను బహిష్కరిస్తున్నమని ప్రకటించిన కేటీఆర్
- ఏ మోహం పెట్టుకుని వస్తారని నిలదీత
- కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
- ఇచ్చిన హామీలు నెవరేర్చాలని డిమాండ్
ప్రధాని మోదీ జులై 8న వరంగల్ పర్యటన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జులై 7న బీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చి రాష్ట్రానికి రావాలని అన్నారు. విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేపటి ప్రధాని పర్యటనను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నామని చెప్పారు.
మోదీని విమర్శించని రేవంత్..
కాంగ్రెస్, బీజేపీల పాలనతో ప్రజలు విసిగిపోయారని వారికి ప్రత్యామ్నయంగా బీఆర్ఎస్ పుట్టిందని అన్నారు. బీజేపీని, ప్రధాని మోదీని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎందుకు విమర్శించారో ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోఉన్న ఆర్ఎస్ఎస్ నేత రేవంత్అని ఎద్దేవా చేశారు. భూదందాలు చేసే వారే ధరణి పోర్టల్ వద్దని అంటున్నారని ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసే పని చేస్తున్నాయన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడో సారి విక్టరీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీ హోదా ఏంటి.. ?
ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాహుల్ఏ హోదాలో ఎన్నికల హామీలు ప్రకటించి, తమపై విమర్శలు చేశారని ప్రశ్నించారు. ఆయన ఆరోపణలను ప్రజలు పట్టించుకోవట్లేదని అన్నారు.
సాయిచంద్ భార్యకు పదవి..
ఫోక్ సింగర్ సాయిచంద్ మరణం పార్టీకి తీరని లోటని మంత్రి అన్నారు. కుసుమ జగదీశ్ అకాల మరణం బాధించిందని అందుకే రెండు కుటుంబాలకు పార్టీ ప్రజాప్రతినిధుల నెల జీతం అందజేస్తామని చెప్పారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా సాయిచంద్ సతీమణి రజిని నియమిస్తున్నామని తెలిపారు.