నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు మంత్రి కేటీఆర్. 221కోట్ల రూపాయల పనులు ఈరోజు ఇబ్రహీంపట్నంలో ప్రాంభించుకున్నామన్నారు. గతంలో ఇబ్రహీంపట్నం కమ్యూనిస్టుల పాలనలో వెనక పడిందన్నారు. అభివృద్ధి చెయ్యమని స్థానికులు కోరుతున్నారన్నారు. పెంక్షన్లు ఇస్తున్నామన్నారు కేటీఆర్. ఏప్రిల్ నెలలో కొత్త పెంక్షన్ లు ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మీ.. షాది ముబారక్ ల ద్వార 10లక్షల మందికి ప్రభుత్వం సహాయం చేసిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి.
విద్యా.. వైద్యం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయిని తెలిపారు. దేశంలో ని 10 బెస్ట్ గ్రామాల్లో 7 తెలంగాణలోనే ఉన్నాయన్నారు. రైతు బంధు.. రైతు భీమా కల్పిస్తున్నామన్నారు. ఎరువులు.. కరెంటు ఇబ్బందులు లేవన్నారు. హైదరాబాద్ కు మోడీ వచ్చారన్నారు. ఇక్కడ ఏం చేశారో తెలియదన్నారు. పార్లమెంట్ లో అసంబద్ధ మాటలు ప్రధానమంత్రి మాట్లాడారన్నారు. తెలంగాణ పై నిప్పులు పోస్తూ పార్లమెంట్ లో మాట్లాడారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
మోడీ.. బీజేపీవీ రెండు నాల్కల ధోరణి అంటూ ధ్వజమెత్తారు. రాష్టానికి ఇస్తా నాన్న ప్రాజెక్టు లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలను అవమానించిన మోడీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విద్యావంతులు బీజేపీ పై దృష్టి పెట్టాలన్నారు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రం పై కోపం ఉందన్నారు. 7మండలాలు APలో కలిపారన్నారు. అంబేద్కర్ బాటలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. దేశంలో నరేంద్రమోదీ రాజ్యాంగం నడుస్తుందని దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్.
ఇవి కూడా చదవండి: