సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా సిరిసిల్లకు వచ్చి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ ధాఖలు చేశారు కేటీఆర్.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. సిరిసిల్లకు బయలుదేరే ముందు ప్రగతి భవన్‌లో పూజలు నిర్వహించిన కేటీఆర్ ను ఆర్చకులు ఆశీర్వదించారు. కేటీఆర్ సిరిసిల్ల బరిలో నిల్చోవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి గజ్వేల్ వెళ్లిన కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డికి సీఎం బయలుదేరారు. అక్కడ కూడా సీఎం నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసగించనున్నారు.
ఇక సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు సిద్దిపేటలోని ఆలయం, దర్గా, చర్చిలో పూజలు చేశారు హరీశ్‌రావు.