సమైక్య రాష్ట్రం లో నిధుల కోసం నేతల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణలోనే అత్యదిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బాన్సువాడలో నిర్మించారన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ కి రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు. నిజాంసాగర్ నీటి కోసం ఒకప్పుడు అనేక పోరాటాలు ముష్టి యుద్ధాలు జరిగాయన్నారు.కరెంటు, తాగు నీటి కోసం అనేక ఆందోళనలు జరిగాయన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు కేటీఆర్. రైతు బంధు ఆలోచన ఏ నాయకునికి రాలేదన్నారు. కొంత మంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణకు ఏం చేశారని తమ కార్లకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
విషం చిమ్మడం కాదు విషయాలు చెప్పండని బీజేపీని నిలదీశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రాజెక్టుల పై వివక్షత ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన బీజేపీ కి తెలంగాణలోనే పుట్టగతులు ఉండవన్నారు మంత్రి. సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని ప్రధాని మోడీ నెరవేర్చలేదన్నారు. ఉపాధి హామీకి 25 శాతం నిధులు తగ్గించారన్నారు. జీవితాలు మార్చమంటే జీవిత భీమాను అమ్మేశారని విమర్శించారు. అవకాశం ఇస్తే తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలిపేస్తారని ఆరోపించారు కేటీఆర్. బీజేపీకి ఓటేసి తప్పు చేశామన్నారు. తమ పాలనలో సర్కారు దవాఖానాలపై నమ్మకం పెరిగిందన్నారు. వృధాగా పారుతున్న గోదావరి జలాలను పంటల కోసం మల్లించామన్నారు.
ఇవి కూడా చదవండి: