హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ.. నల్ల డబ్బు తెస్తానని చెప్పి తెల్ల మొఖం వేశాడని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలు ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోడీ తిట్టారని మరి ఇప్పుడు అదే గ్యాస్ సిలిండర్ రూ.1200 అయ్యిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏమీ చేయలేదని, మోడీ వలన లాభపడ్డ ఏకైక వ్యక్తి ఆదానీ మాత్రమేనని ఆరోపించారు.
కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి తనకు సిగ్గు అయింతుదని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్ కుమార్ ను గెలిపించి.. బండి సంజయ్ ను ఇంటికి పంపాలని సూచించారు.
75 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్టాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలని ఏ మొఖం పెట్టుకొని అడుగుతున్నారని ఆ పార్టీ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అంటే భారత రైతుల పార్టీ అని అన్న కేటీఆర్ .. రంగు మరీనా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తు్ందని చెప్పారు. ఈ విషయంలో రైతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు.