కార్యకర్తలు లేకుండా తాము లేమని మంత్రి కేటీఆర్ అన్నారు. పదువులు వస్తుంటయ్, పోతుంటయ్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాం అన్నది ముఖ్యమని చెప్పారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన అత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. డైలాగులు కొట్టడం ఈజీనే కానీ పని చేయడమే కష్టమని అన్నారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అలా మాట్లాడే సంస్కారం తనకు లేదన్నారు. తాను పేపర్ లీక్ చేసి బతుకుతున్నానా అని ప్రశ్నించారు.
ఇక ప్రధానీ మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ పుట్టుక గురించి మోడీ పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారని అన్నారు. మోడీ తన దోస్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని, అదానీ అని విమర్శించారు. అదానీ కోసం మోడీ ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్షను చూపిస్తుందని.. రాష్ట్రాన్ని శత్రువగా చూస్తుందన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం సుసాధ్యం కానీ పనులను చేసి చూపిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. గ్రామస్వరాజ్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రం అవార్డులు అయితే ఇస్తుంది కానీ నిధులను మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. రూ. కోటి బకాయిలున్న గ్రామాలకు వెంటనే నిధులను విడుదల చేస్తామని, ఇందుకోసం రూ. 1300 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లుగా తెలిపారు.