
హైదరాబాద్: గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటారా అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. గాంధీని గాడ్సే చంపడం కరెక్ట్ అని, గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపీ మతోన్మాదులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలకు అంతర్జాతీయ సమాజానికి దేశ ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలని పీఎం మోడీని నిలదీశారు.
PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots?
— KTR (@KTRTRS) June 6, 2022
It is BJP that should apologise; not India as a Nation
Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out
దేశ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నందుకు బీజేపే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతి పిత గాంధీజీపై ఎంపీ ప్రజ్ఞా సింగ్ అనుచితంగా కామెంట్ చేస్తే.. ప్రధాని మోడీ నోరు తెరవకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంపై పీఎం మోడీ ఏమీ మాట్లాడకపోవడాన్ని బట్టి చూస్తే మోడీ, అమిత్ షా వంటి బీజేపీ అగ్ర నేతలు దీని వెనుక ఉన్నారనిపిస్తోందని అన్నారు. ఇది దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు.
Modi Ji, Your silence was deafening & shocking when BJP MP Pragya Singh hailed assassination of Mahatma Gandhi
— KTR (@KTRTRS) June 6, 2022
Let me remind you sir; What you permit is what you promote
The tacit support from top is what emboldened the bigotry & hatred that will cause irreparable loss to ?? pic.twitter.com/VSgHd6P2Hh
మరిన్ని వార్తల కోసం...