వ్యూహం ఫలించేనా..! వేములవాడపై మంత్రి కేటీఆర్​ ఫోకస్

  •     స్థానిక ఎమ్మెల్యే తీరుతో అసంతృప్తిగా ఉన్నవారు బయటకు వెళ్లకుండా చర్యలు 
  •     సొంత జిల్లాలో పార్టీ బలోపేతానికి కేటీఆర్​ ప్లాన్​
  •     అసంతృప్తితో ఉన్న  కేడర్‌‌‌‌ను కాపాడుకునేందుకు లీడర్ల ఎంకరేజ్​
  •     వీరిలో ఎవరికి వారు తనకే టికెట్ అంటూ ప్రచారం

వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గంపై బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్‌‌, మంత్రి కేటీఆర్​ నజర్​ పెట్టారు. నియోజకవర్గంలో కేడర్​ చేజారకుండా మంత్రి స్కెచ్​ వేసినట్లు తెలుస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు నియోజకవర్గాలు ఉండగా సిరిసిల్లకు ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో నియోజకవర్గం వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్​బాబు తీరుతో కేడర్ ​అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసంతృప్త కేడర్ ​వేరే పార్టీల్లోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా  వ్యవహరిస్తున్నారు. రమేశ్​బాబుకు వ్యతిరేకంగా టికెట్​ ఆశిస్తున్న ఇద్దరు లీడర్లు బాహాటంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ ​వస్తుందని ఎవరికి వారే చెప్పుకుంటున్నా కేటీఆర్​ కావాలనే మౌనం వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

వేములవాడలో పట్టు కోసం వ్యూహం

ప్రస్తుత ఎమ్మెల్యే రమేశ్‌‌బాబుపై పౌరసత్వ వివాదం, నియోజకవర్గంలో ఆయన తీరుతో పార్టీలో, కేడర్‌‌‌‌లో వ్యతిరేకత నెలకొంది. ఈక్రమంలో ఆయనకు దూరంగా ఉంటున్న లీడర్లు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కేటీఆర్​ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా వేములవాడ రాజకీయాల్లోకి ఇన్‌‌వాల్వ్​ అవుతున్నారు.  రమేశ్​బాబుకు ప్రత్యామ్నాయంగా చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఏనుగు మనోహర్‌‌‌‌రెడ్డిని ఎంకరేజ్​ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇద్దరూ తనకే టికెట్​వస్తుందని నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈక్రమంలో చల్మెడ వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డులో ఏకంగా పార్టీ ఆఫీస్​ఓపెన్​ చేశారు. 

 ఆఫీస్​ తన వ్యక్తిగతమని చెప్పినప్పటికీ కేటీఆర్​ఆశీస్సులు ఉన్నాయని  కేడర్‌‌‌‌లో చర్చ జరుగుతోంది. మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ ఏనుగు మనోహర్‌‌‌‌రెడ్డి తన గ్రౌండ్​ లెవల్‌‌లో తన పని తాను చేసుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రమేశ్​బాబు మాత్రం టికెట్‌‌ విషయం హైకమాండ్​చేసుకుంటుందని కామెంట్​చేస్తున్నారు.  మరోవైపు కేడర్‌‌‌‌ కూడా మూడు వర్గాలుగా విడిపోయి ఉంది. 

కేటీఆర్​ వ్యూహం ఫలించేనా..!

వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై లీడర్లు, కార్యకర్తల్లో అసమ్మతి ఉందన్న విషయాన్ని గ్రహించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యర్థి పార్టీలకు లాభం జరకుండా నష్ట  నివారణ చర్యలు చేపడుతున్నారు. అసంతృప్తి కేడర్​ ఈ మూడు వర్గాల్లో ఏదో ఓ వర్గంలో ఉండేలా ప్లాన్ ​చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ​అభ్యర్థిపై స్వల్ప ఓట్లతో గట్టెక్కిన నేపథ్యంలో ఈ సారి పార్టీకి నష్టం జరగొద్దనే భావనలో కేటీఆర్​ ఉనారు. ఎమ్మెల్యేపై  వ్యతిరేకత పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.  ఈక్రమంలోనే చల్మెడ, మనోహర్‌‌‌‌రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల టైంలో వీరిలో ఒకరికి టికెట్​ఇచ్చి మరొకరికి నామినేటెడ్​ పదవి ఇవొచ్చన్న  ప్లాన్‌‌లో కేటీఆర్​ ఉన్నట్లు తెలుస్తోంది. కేడర్‌‌‌‌ కూడా మూడు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో  ఎన్నికల దాకా చూడాల్సిందే.